Chandrababu : రేపు రాత్రికి ఢిల్లీకి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. ఎన్టీఏ నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. ఎన్టీఏ నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక జరిగిన తర్వాత నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు రేపు రాత్రికి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 21వ తేదీ ఉప రాష్ట్రపతి నామినేషన్ కు గడువు ముగియడంతో నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుంది.
ఎన్డీఏ సమావేశంలో..
ఈ నెల 20వ తేదీన జరిగే సమావేశంలో పాల్గొనేందుకు మాత్రమే చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్టీఏ అభ్యర్థికి మద్దతును ప్రకటించనున్నారు. దీంతో పాటు చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రులతో చంద్రబాబు నాయుడు భేటీకానున్నారు.