Chandrababu : నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సీఐఐ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. నవంబరు నెలలో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో పార్ట్ నర్ షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు జరిగే సదస్సులో పాల్గొని ఆయన విశాఖ సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరనున్నారు.
కేంద్ర మంత్రులను కలిసే...
దీంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలను పరిశీలించాలని చంద్రబాబు నాయుడు పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే వచ్చే రాయితీలను కూడా వివరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేశ్ కూడా నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇద్దరూ కేంద్ర మంత్రులను ఈ ఢిల్లీ పర్యటనలో కలిసే అవకాశముందని తెలిసింది.