Chandrababu : నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే చంద్రబాబు ఉండనున్నారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళతారు. రేపు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. ఈ సమావేశంలో పోలవరానికి సంబంధించి అంతరాష్ట్ర వివాదాలపై చర్చించనున్నారు.
రేపు కేంద్ర మంత్రులతో....
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో పాటు ఏడుగురు కేంద్ర మంత్రులతో శుక్రవారం భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై చర్చించనున్నారు. దీంతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలంటూ యాపిల్ వంటి సంస్థల సీఈవోలతో భేటీ అయి ఆహ్వానించనున్నారు. మూడు రోజుల పాటు డిల్లీలోనే చంద్రబాబు ఉండనున్నారు.