Chandrababu : ఈ నెల 14న ఢిల్లీకి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 14వ తేదీన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 14వ తేదీన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఖరారయితే మోదీని కూడా కలిసే అవకాశముంది. అపాయింట్ మెంట్ ఖరారయితే రెండు రోజులు ఢిల్లీలోనే ఉండి అన్ని విషయాలు చర్చించి వస్తారని తెలిసింది.
బనకచర్ల ప్రాజెక్టుపై
దీంతో పాటు బనకచర్ల ప్రాజెక్టుపై కూడా కేంద్ర మంత్రితో చర్చించే ఛాన్స్ ఉంది. గోదావరి వరద జలాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు వినియోగిస్తామని, అంతకు మించి ఒక్క చుక్క నీరు కూడా తమకు అవసరం లేదని, వృధాగా సముద్రంలో కలిసే నీటిని మాత్రమే వాడుకుంటామని చెప్పారు. తెలంగాణ అభ్యంతరాలు, తమ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారన్న దానిపై ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. విశాఖ, విజయవాడ మెట్రో పై కూడా చర్చించే ఛాన్స్ ఉందని తెలిసింది.