Chandrababu : నేడు నారావారిపల్లెకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు చిత్తూరు జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు.

Update: 2025-10-07 02:44 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు చిత్తూరు జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన నారావారిపల్లెకు చంద్రబాబు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో నేడు చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు సంవత్సరీకం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులందరూ నారావారిపల్లెకు చేరుకున్నారు.

సోదరుడి కార్యక్రమంలో...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారావారిపల్లెకు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుపతి విమానాశ్రయం నుంచి నారావారిపల్లె వరకూ విస్తృత బందోబస్తును నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతల కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి ఆయన తిరుపతి నుంచి విజయవాడకు చేరుకుంటారు.


Tags:    

Similar News