Chandrababu : నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు కేంద్ర మంత్రులను కలవనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర మంత్రికి వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు.
రేపు కేంద్రమంత్రితో సమావేశం...
సాస్కి తో పాటు పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేయనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. అదే రోజు రాత్రి సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.