Chandrababu : నేడు హైదరాబాద్ కు చంద్రబాబు
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు రానున్నారు.
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు రానున్నారు. రేపు రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరనున్నారు. ఆరు రోజులపాటు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులతో వరస భేటీలను చంద్రబాబు జరపనున్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు...
పారిశ్రామిక వేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు అవసరమైన రాయితీలను కల్పిస్తామని చెప్పనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌తో పరిశ్రమలు తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు ఆరు రోజుల పాటు సింగ్ పూర్ లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం కావాలని కోరనున్నారు.