Chandrababu : నేరగాళ్లను ఊడ్చిపారేయాల్సిందే : చంద్రబాబు

నేరగాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Update: 2025-07-19 13:12 GMT

నేరగాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుపతిలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. తాను తిరుపతి నుంచి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యే నుంచి మంత్రిని అయి తర్వాత నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యానని అన్నారు.

గూండాయిజాన్ని...
కానీ కొందరు ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని చంద్రబాబు వైసీపీ పాలనపై పరోక్షంగా వమర్శలు చేశారు. నేరచరిత్ర కలిగిన వారు రాజకీయాల్లోకి వచ్చారని, ఇంట్లో చెత్తను ఊడ్చినట్లు వారిని ఊడ్చిపారేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మతకలహాలను నివారించామని, ఫ్యాక్షనిజం, గూండాయిజాన్ని రూపుమాపామని తెలిపారు. నేరగాళ్ల గుండెల్లో నిద్రపోతానంటూ చంద్రబాబు హెచ్చరించారు.


Tags:    

Similar News