కమ్యూనిజానికి కాలం చెల్లింది : చంద్రబాబు
కమ్యూనిజానికి కాలం చెల్లిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు
కమ్యూనిజానికి కాలం చెల్లిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అనేక సమస్యలకు పరిష్కారం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చూపించిందన్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేయాలేదన్నారు.
ఢిల్లీలో హాఫ్ ఇంజిన్ సర్కార్...
ఢిల్లీలో హాఫ్ ఇంజిన్ సర్కార్ ఉన్నందునే ఇక్కడ అభివృద్ధి సాధ్యం కాలేదన్న చంద్రబాబు దేశం అభివృద్ధి చెందాలంటే అది ఎన్డీఏతోనే సాధ్యమవుతుందని తెలిపారు. కమ్యునిజం పోయి టూరిజం వచ్చిందని ఆయన సెటైర్ వేశారు. ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు. సంపద సృష్టించడం ద్వారానే సంక్షేమ పథకాలను అమలు చేయడం సాధ్యమవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మారుమోగిపోతుందన్నారు.