Chandrababu : నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఇంతకంటే భారీ మెజారిటీ వచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. అందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలగాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం మంచి పనులు చేశమో చెప్పి ప్రజలను కూటమి వైపునకు తిప్పుకునేలా నేతలు వ్యవహరించాలని, చేసిన పనిని చెప్పుకోలేకపోతే ఎన్నికల్లో ఇబ్బందులు పడతామని తెలిపారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ...
అందుకే మంత్రులు, నేతలు ప్రజల్లో నిత్యం తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్దిని వివరించేందుకు ప్రయత్నించాలన్నారు. అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే విజయం సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని కూడా ప్రజలకు వివరించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. లేకుంటే భవిష్యత్ లో అందరూ ఇబ్బంది పడతామని తెలిపారు. నేతలు, మంత్రులు నిరంతరం ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు నాయుడు సూచించారు.