Chandrababu : నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు.

Update: 2025-07-15 02:50 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలోనే ఉంటారు. ఈరోజు మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. సాయంత్రం మాజీ ప్రధాని పీవీ నరసింహరావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసి రాష్ట్ర రాజకీయాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

రేపు బనకచర్లపై...
రేపు కేంద్రమంత్రులు సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్ లను కూడా చంద్రబాబు కలవనున్నారు. ఇక బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొని చంద్రబాబు బనకచర్లపై తమ వాదనను వినిపించనున్నారు.


Tags:    

Similar News