Chandrababu : నేడు ఢిల్లీలో చంద్రబాబు బిజీ బిజీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు

Update: 2025-08-22 02:20 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నేడు మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. పలు ప్రాజెక్టులకు, రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి నిర్మలా సీతారామన్ ను కోరనున్నారు.

నీతి అయోగ్ ఛైర్మన్ తో...
మధ్యాహ్నం 3.15 గంటలకు నీతి అయోగ్ ఛైర్మన్ అరవింద్ పనగారియోతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కాను్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఎకనామిక్ టైమ్స్ నిర్వహిస్తున్న వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకోనున్నారు. పార్టీ పార్లమెంటు సభ్యులతో కూడా చంద్రబాబు సమావేశమయ్యే అవకాశముంది.


Tags:    

Similar News