Chandrababu : చేనేత కార్మికులకు చంద్రబాబు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత కార్మకులకు గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2025-08-02 00:59 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పారు. మగ్గాలున్న చేనేతలకు ఈ నెల 7వ తేదీ నుంచి ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పవర్ లూమ్స్ కు ఐదు వందలు, హ్యాండ్ లూమ్స్ కు రెండువందల యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్తు అందిస్తామని తెలిపారు. చేనేత కార్మికులను రాష్ట్రంలో ఆదుకునే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

తయారు చేసిన ఉత్పత్తులకు...
చేనేత కార్మికులు తయారు చేసే చేనేత వస్త్రాలకు సామాజిక మాధ్యమాల ద్వారా విక్రయించేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ఏ వస్తువైనా తయారు చేయడమే కాదని, మార్కెటింగ్ ముఖ్యమని చంద్రబాబు అన్నారు. జమ్మలమడుగులో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులు ప్రపంచంలో ఎక్కడికైనా పంపించవచ్చని చెప్పారు. ఆన్ లైన్ లోనే విక్రయించవచ్చని, దళారులను నమ్ముకోవద్దని కూడా చంద్రబాబు తెలిపారు.


Tags:    

Similar News