Chandrababu : మూడోసారి వార్నింగ్ ఉండదు.. యాక్షన్ తప్పదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు

Update: 2025-08-24 02:47 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. తరచూ వివాదాల్లో చిక్కుకునే వారిని పార్టీ విడిచిపెట్టబోదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సీనియర్ ఎమ్మెల్యేలకు పార్టీ విధానాలు, క్రమశిక్షణ గురించి తెలుసు కాబట్టి పద్ధతిగా నడచుకుంటున్నారని, కానీ కొత్త ఎన్నికైన ఎమ్మెల్యేలు బాధ్యతగా ఉండాల్సిందిపోయి పార్టీ లైన్ తప్పుతున్నారని అన్నారు. గాడి తప్పిన ఎమ్మెల్యేలను ఒకసారి పద్ధతి మార్చుకోవాలని చెప్తానని, మరోసారి హెచ్చరిస్తానని, ఇక మూడో సారి హెచ్చరికలు ఉండవని, మూడోసారి పిలుపు రాదని యాక్షన్ కు దిగుతానని ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.

వివాదాలకు పాల్పడితే...
రెండోసారి పిలవాలా? వద్దా? అన్నది వారి ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని చంద్రబాబు సీరియస్ గా చెప్పారు. ప్రజాప్రతినిధులే తప్పు చేయడం సరికాదని, సమన్వయ కర్తలు, జిల్లా ఇన్ ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలకు ఈ విషయం చెప్పాలని చంద్రబాబు వారికి సూచించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరొక సారి గెలిచేందుకు కృషి చేయాలి కానీ, పదే పదే వివాదాలు చేస్తూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా మిగిలి పోవాలి అనుకుంటే ఇక మీ ఇష్టం అని అన్నారు. అందుకుని అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని లేకుంటే రాజకీయ భవిష్యత్ ఉండదని ఆయన హెచ్చరించారు.


Tags:    

Similar News