Chandraabu : బీజేపీకి చంద్రబాబు ఇప్పుడు ప్రయారిటీ కాదా? ఇక కష్టాలు మొదలయినట్లేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించాల్సిన నిధులు ఇప్పటికే తెచ్చేసుకున్నారు

Update: 2025-08-29 08:56 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించాల్సిన నిధులు ఇప్పటికే తెచ్చేసుకున్నారు. తొలి ఏడాదిలోనే అవసరమైన నిధులకు సమీకరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించింది. అయితే రానున్న కాలంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లినా అనుకున్న స్థాయిలో నిధులు వచ్చే అవకాశాలు లేవన్నది ఉన్నతాధికారుల నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వం ఫోకస్ అంతా బీహార్ పైనే ఉంది. బీహార్ లోనూ, వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడుపైన ఎక్కువ దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయి.

ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో...
ఆంధ్రప్రదేశ్ కు ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో పాటు ఇప్పటికే చంద్రబాబు అడిగినంత మేరకు ఆర్థిక సాయం చేయడమే కాకుండా అవసరమైన రుణ సదుపాయాన్ని కూడా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు బీజేపీకి చంద్రబాబు ప్రయారిటీ కాదన్నది రాజకీయంగా వాస్తవం. చంద్రబాబు నాయుడు కూటమిలోనే ఉన్నందున ఆయన వల్ల రాజకీయంగా ఇబ్బందులు తలెత్తవని కూడా బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ లోని 34 విభాగాల్లో ప్రయివేటీకరణకు సిద్ధమయిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల విడుదలలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇక పెద్దగా ఆసక్తి చూపదని చెబుతున్నారు.
సంక్షేమ పథకాలను గ్రౌండ్ చేసి...
ఇప్పటికే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుందని భావించి సంక్షేమ పథకాలను గ్రౌండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్షల కోట్లు అప్పులు చేశారు. ఎఫ్ఆర్ఎంబీ పరిమితికి మించి అప్పులు చేశారన్న ఆరోపణలు కూడా విపక్ష వైసీపీ నేతలు చేస్తున్నారు. అదే సమయంలో ఇక ప్రతి నెలా సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం కంటే హామీలకు అవసరమైన నిధుల అవసరం ఎక్కువ కావడంతో ఇక రానున్న కాలంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు తప్పవన్న కామెంట్స్ అధికారిక వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు సమావేశమయినప్పటికీ ఆశించిన స్పందన లేదని అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడుకు రానున్న కాలం ఖజానాను నింపడం, వెల్ఫేర్ స్కీమ్స్ ను కొనసాగించడం కత్తిమీద సాము వంటిదేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News