Andhra Pradesh : డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. పెట్రోలు బంకులు
డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు
petrol rates
డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. డ్వాక్రా మహిళలకు పెట్రోలు బంకులు ఇవ్వాలని నిర్ణయించారు. పట్టణంలో ఉన్న డ్వాక్రా మహిళలు స్వయం శక్తితో నిలదొక్కుకునేందుకు వారికి పెట్రోలు బంకులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఇరవై ఐదు పట్టణాల్లో...
పట్టణ డ్వాక్రా మహిళలకు రాష్ట్రంలో మొత్తం ఇరవై ఐదు పెట్రోలు బంకులు మంజూరు చేయనున్నారు. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు అయ్యే పెట్టుబడి వారి పొదుపు నుంచి ఖర్చు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. స్థలాలు సేకరించాలని పురపాలిక కమిషనర్లకు ఆదేశాలు వెళ్లాయి.