Chandrababu Naidu : గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. దివ్యాంగులు అందరికీ పింఛన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Update: 2025-08-28 02:49 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. దివ్యాంగులు అందరికీ పింఛన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సెప్టంబరు నెలలో అందరు దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేయాలని అన్నారు. నోటీసులు ఇచ్చిన వారికి ఎవ్వరికీ పింఛన్లు ఆపవద్దని చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.

పార్టీ నేతలు కూడా...

ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పెన్షన్లు తెచ్చింది తామేనని, పెంచింది తామేనని, 500 రూపాయల ఉన్న దివ్యాంగుల పెన్షన్లను ఆరు వేలు చేశామన్న ఆయన మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు ఇస్తుంది కూడా మనమేనని అన్నారు. అర్హులకు న్యాయం జరిగేలా పార్టీ యంత్రాంగం పని చేయాలని పిలుపు నిచ్చారు. పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఇంటింటికి వెళ్లాలని, ప్రజలకు ఎంతో చేస్తున్నామని, చేసింది చెప్పుకుందామని, త్వరలో జిల్లా కమిటీల ప్రకటన... రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తామని చంద్రబాబు తెలిపారు.


Tags:    

Similar News