Chandrababu : చంద్రబాబు వరసగా కేంద్రమంత్రులతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఉదయం నుంచి వరసగా కేంద్ర మంత్రులతో సమావేశం అవుతూ రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. ఈరోజు తొలుత కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెదిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ లతో కలసి కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు.
రాష్ట్రానికి సంబంధించి...
సోలార్ ప్రాజెక్టులు, ప్రధాని సూర్యఘర్ పథకం అమలు వంటి వాటిపై ఆయనతో చంద్రబాబు చర్చించారు. తర్వాత రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతరం సీఆర్ పాటిలోనూ సమావేశమై చర్చించారు. కాసేపటి క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యారు. చంద్రబాబు వెంట రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి విడుదల కావాల్సిన నిధులపై నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు చర్చించారు.