Andhra Pradesh : నేడు కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు దిశగా
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు
andhra pradesh cabinet meeting
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనేక ముఖ్యమైన నిర్ణయాలు ఈ కేబినెట్ లో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యమైన విషయాలపై...
ప్రధానంగా పింఛను మొత్తాన్ని పెంపుదల, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత నిధుల విడుదల, మిచౌంగ్ తుఫాన్ పంట నష్టం వంటి వాటిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు ఎన్నికలకు ముందు అమలు పర్చాల్సిన పథకాలపై కూడా చర్చించే అవకాశముందని తెలిసింది. కీలకమైన నిర్ణయాలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.