సెప్టంబరు 4న ఏపీ మంత్రి వర్గ సమావేశం

సెప్టంబరు 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు

Update: 2025-08-31 02:37 GMT

సెప్టంబరు 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టులో పురోగతితో పాటు అమరావతి రాజధాని పనులపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై...
దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అంశంపై కూడా చర్చించనున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించే తేదీలతో పాటు అజెండాను కూడా ఖరారు చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు, వివిధ సంస్థలకు భూముల కేటాయింపుపై కూడా వచ్చే నెల 4వ తేదీన జరిగే మంత్రి వర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News