Andhra Pradesh : మహిళ దినోత్సవం సందర్భంగా తీపికబురు
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. మహిళలకు కానుక ప్రకటించే అవకాశముంది
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో ఈ మసమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.
డ్వాక్రా మహిళలకు...
ఈ సమావేశంలో మహిళ దినోత్సవం సందర్భంగా కానుక ఇవ్వాలని నిర్ణయించారు. డ్వాక్రా మహిళలకు కొత్త పథకాన్ని ప్రకటించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే మహిళ దినోత్సవంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.