Andhra Pradesh : వైసీపీ నిరసనల మధ్య ప్రారంభమయిన గవర్నర్ ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Update: 2026-02-11 04:47 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమయిన వెంటనే వైసీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఏపీలో శాంతి భద్రతలను కాపాడాలని, ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

నినాదాలు చేస్తుండటంతో...
ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల సమస్యపై వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. వైసీపీ సభ్యుల నినాదాల మధ్యనే గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. వైసీపీ సభ్యుల నిరసనతో సభలో గవర్నర్ ప్రసంగం వినకుండా పోతుంది. పీపీపీ పద్ధతిలో కాకుండా మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్మించాలని వారు నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు నినాదాల మధ్యనే గవర్నర్ ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తూ ఈ రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమయిన కొద్దిసేపటికి వైసీపీ సభ్యులు సభ నుంచి బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు.


Tags:    

Similar News