నిడదవోలు ప్రాంతానికి మహాపాదయాత్ర

అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది. నిడదవోలు నియోజకవర్గంలో నేడు యాత్ర కొనసాగుతుంది

Update: 2022-10-13 06:32 GMT

అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది. నిడదవోలు నియోజకవర్గంలో నేడు యాత్ర కొనసాగుతుంది. రైతుల మహా పాదయాత్ర నేడు 32వ రోజుకు చేరుకుంది. అయితే మహాపాదయాత్ర దారిపొడవునా నిరసన తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కొందరు నిరసనను తెలియజేస్తున్నారు. అయినా శాంతియుతంగా పాదయాత్ర చేయడానికే నిశ్చయించుకున్నారు.

ఈరోజు 15 కి.మీ...
ఈరోజు పాదయాత్ర ఉండ్రాజవరం నుంచి బయలుదేరి వెేలివెన్ను వరకూ చేరుకుంటుంది. అక్కడ భోజనం చేసిన తర్వాత పెరవలి మండలం నడిపల్లి కోట కానూరు మీదుగా మునిపల్లి చేరుకుంటుంది రాత్రి బస అక్కడే చేస్తారు. ఈరోజు 15 కిలోమీటర్ల మేర నడవాలని రైతులు నిర్ణయించుకున్నారు. దారిపొడవునా నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు పాదయాత్రకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News