ఆ విచారణ వాయిదా.. కేసును రీఓపెన్ చేస్తారా?

అమరావతి అసైన్డ్ భూముల అంశంపై ఏపీ హైకోర్టులో ఈరోజు

Update: 2023-12-14 10:46 GMT

chandrababu

అమరావతి అసైన్డ్ భూముల అంశంపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ వేసిన క్వాష్ పిటిషన్లపై ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజా విచారణ సందర్భంగా ఈ కేసులో మరికొందరిని నిందితులుగా చేర్చామని హైకోర్టుకు సీఐడీ తెలిపింది. కేసును రీఓపెన్ చేయాలని కోర్టును కోరింది. కేసును రీఓపెన్ చేయడంపై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో డిసెంబర్ 12న విచారణ జరిగింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 17కి వాయిదా వేసింది. కేసుకు సంబంధించి ఇటు చంద్రబాబు కానీ, అటువైపు ఏపీ ప్రభుత్వం కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని సూచించింది. చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు రావాల్సి ఉంది.


Tags:    

Similar News