తిరువూరు మెప్మా లో పదిహేడు కోట్లు స్వాహా?

తిరువూరు మెప్మా కార్యాలయంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు అధికారులకు అందాయి

Update: 2026-01-06 07:52 GMT

తిరువూరు మెప్మా కార్యాలయంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు అధికారులకు అందాయి.తిరువూరు పట్టణంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరు పేరుతో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని మెప్మాకార్యాలయం కేంద్రంగా సుమారు పదిహేడు కోట్ల మేర రుణాల కుంభకోణం జరిగినట్లు బాధిత మహిళలు, సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అర్హులైన మహిళలకు రుణాలు అందించినట్లు రికార్డుల్లో చూపుతూ, వాస్తవానికి ఆ నిధులను మధ్యవర్తులు, కొందరు అధికారుల కుమ్మక్కుతో దారి మళ్లించారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

బాధితుల ఫిర్యాదు మేరకు...
అనేక సంఘాల పేర్లతో నకిలీ బ్యాంక్ ఖాతాలు తెరవడం, రుణాలను ఇతరుల ఖాతాలకు బదిలీ చేయడం, కొందరి పేర్లపై సంతకాలు ఫోర్జరీ చేయడం వంటి అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.కొన్ని సంఘాలకు తెలియకుండానే రుణాలు మంజూరైనట్లు చూపించడం.. రుణం తీసుకోని మహిళల పేర్లపై బ్యాంక్ బాకీలు నమోదవడం.. బ్యాంక్ ఖాతాల నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తున్నారుర. అధికారుల నిర్లక్ష్యం లేదా ప్రత్యక్ష భాగస్వామ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకువిజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు, అలాగే మెప్మా డైరెక్టర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు.


Tags:    

Similar News