Andhra Pradesh : కైలాసయాత్రకు వెళ్లి చిక్కుకున్న ఏపీకి చెందిన 70 మంది

కైలాసయాత్ర ముగించుకొని చైనా బోర్డ‌ర్ దాటి నేపాల్ బోర్డ‌ర్‌లోని ప‌ర్వ‌త ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ యాత్రికులు చిక్కుకుపోయారు

Update: 2025-09-02 04:30 GMT

కైలాసయాత్ర ముగించుకొని చైనా బోర్డ‌ర్ దాటి నేపాల్ బోర్డ‌ర్‌లోని ప‌ర్వ‌త ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ యాత్రికులు చిక్కుకుపోయారు భారీ వ‌ర్షాలు కార‌ణంగా హెలికాఫ్ట‌ర్‌లు నిలిచిపోవ‌డంతో రెండు రోజులుగా హిల్సా ప్రాంతంలో అక్క‌డే చిక్కుకుపోయారు. సిమికోట్ ప్రాంతంలో నాలుగు రోజులుగా చిక్కుకుపోయి ప‌డిగాపులు ప‌డుతున్న మరో 32 మంది యాత్రికులున్నారు.

గత నెలలో బయలుదేరి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుండి ఆగ‌ష్టు 25న బ‌య‌లుదేరి కైలాస మానస సరోవరం యాత్ర‌కు డెబ్భయి మంది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన 70 మంది తెలుగువారు చిక్కుకుపోయారు. భారీ వ‌ర్షాలు, చలిగాలుల తీవ్ర‌త కార‌ణంగా చాలామంది యాత్రికులు అనారోగ్యం పాలయ్యారంటున్నారు. యాత్రికుల‌తో క‌లిసి యాత్ర‌కు వెళ్లిన త‌ణుకుకు చెందిన‌ న‌లుగురు వైద్యులు వారితో తీసుకు వెళ్ళిన అత్యవసర మందులతో యాత్రికుల‌కు వైద్య సేవ‌లందిస్తున్నారు. వారిని తిరిగి రాష్ట్రానికి సురక్షితంగా తీసుకు రావాలని కోరుతున్నారు.


Tags:    

Similar News