నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
నేటి నుంచి గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకారం ప్రారంభమయింది.
నేటి నుంచి గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకారం ప్రారంభమయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల స్వీకారానికి ఈ నెల 10 చివరి తేదీగా నిర్ణయించారు.
తెలంగాణలో రేపు...
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను అధికారులు స్వీకరించనున్నారు. ఈ నెల 11వ తేదీన నామినేషన్ల పరిశీలించనున్నారు. 13వతేదీన ఉపసంహరణకు గడువును ఎన్నికల కమిషన్ విధించింది. తెలంగాణలోనూ నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు ప్రత్యేక అసెంబ్లీ సందర్భంగా నా ప్రధాన పార్టీల అభ్యర్థులు మినేషన్ దాఖలు చేయనున్నారు.