వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి బెయిల్ మంజూరు.. అయితే షరతులివీ

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది

Update: 2025-09-29 11:49 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గత 71 రోజులుగా మిధున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. రెండు లక్షల పూచికత్తు సమర్పించాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. మిధున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారంలో రెండు రోజుల పాటు సంతకాలు చేయాలని సూచించింది. ఈ ఏడాది జులై 19 తేదీన మిధున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులోఅరెస్ట్ అయ్యారు.

ఇప్పటి వరకూ ఐదుగురికి...
ఇప్పటి వరకూ ఈ కేసులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ లకు బెయిల్ మంజూరు చేసింది. మిధున్ రెడ్డికి కూడా బెయిల్ మంజూరు కావడంతో ఐదుగురికి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ లభించినట్లయింది. ఆయనను సోమవారం, శుక్రవారం నాడు సిట్ అధికారుల ఎదుట హాజరై సంతకాలు పెట్టాలని సూచించారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఐదుగురికి బెయిల్ లభించినట్లయింది. ఆర్డర్ కాపీలు రాజమండ్రి జైలు అధికారులకు అందిన తర్వాత మిధున్ రెడ్డిని జైలు నుంచి విడుదల కానున్నారు.


Tags:    

Similar News