2 కిలోల పులస చేప.. 26,000 రూపాయలు

పులస చేప ఎప్పటికప్పుడు రికార్డు ధరలకు అమ్ముడుపోతూ ఉంది.

Update: 2025-07-23 09:00 GMT

పులస చేప ఎప్పటికప్పుడు రికార్డు ధరలకు అమ్ముడుపోతూ ఉంది. యానాంలో 2 కేజీల పులస చేపను ఏకంగా 26వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేవారు. ఈ చేపను ఆత్రేయపురం పేరవరం వాసి సతీష్‌ వేలంలో దక్కించుకున్నారు. వారం రోజుల్లోనే రికార్డు ధరకు అమ్ముడుపోయాయి రెండు పులసలు. ఇంతకు ముందు 18వేలు, 22వేలు పలకగా ఇప్పుడు ఏకంగా 26వేలు ధర పలికింది. ఈ సీజన్‌లో గోదావరిలోకి ఎర్రనీరు రావడంతో పులసలు పడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో పులస చేపలకు మంచి పేరున్నా వాటి లభ్యత తగ్గిపోతోందని మత్య్సకారులు చెబుతూ ఉన్నారు. పులసలు సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి గోదావరిలోకి వెళుతూ వలకు చిక్కుతూ ఉంటాయి.

Tags:    

Similar News