Tenth Exams : నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

నేటి నుంచి ఏపీ, తెలంగాణలలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి

Update: 2024-03-18 02:43 GMT

నేటి నుంచి ఏపీ, తెలంగాణలలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చింది. ఐదు నిమిషాలు పరీక్ష కేంద్రానికి వచ్చినా అనుమతించాలని నిర్ణయించింది. ఉదయం 8.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఏపీలో ఈ నెల 30వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం 3,474 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్చి 28వ తేదీతో పరీక్షలు ముగిసినప్పటికీ మరో రెండు రోజుల పాటు ఓరియంటల్, వెకేషనల్ పరీక్షలుంటాయి. ఈ ఏడాది 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని, హాల్ టిక్కెట్ చూపిస్తే చాలునని అధికారులు పేర్కొన్నారు.

పరీక్షలకు అవసరమైన...
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎవరినీ అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఫ్లైయింగ్ స్వ్కాడ్ లతో పాటు సిట్టింగ్ స్వ్కాడ్ లను కూడా నియమించారు. కాపీయింగ్ జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లోకి ఇన్విజిలేటర్, సిబ్బందితో సహా ఎవరినీ సెల్‌ఫోన్లు అనుమతించడం లేదు. సెల్‌ఫోన్లు పరీక్ష కేంద్రం బయట డిపాజిట్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈపరీక్షల్లో 5.08 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.


Tags:    

Similar News