ఉద్యోగులతో పవన్ మాటా మంతీ
పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ ఉద్యోగులతో సమావేశమయ్యారు
ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖల మంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. సీ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అధికారులు, సిబ్బంది హాజరయ్యార. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో మాటా - మంతి కార్యక్రమంలో వారి సమస్యలను అడిగి పవన్ తెలుసుకుంటున్నారు.
పంచాయతీల్లో సమస్యలపై...
గ్రామాల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుందని కొందరు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు వచ్చారు. మరికొందరు తాగునీటి సౌకర్యం లేదని, రక్షిత మంచినీటిని అందించాలని కోరారు. రహదారులను కూడా మెరుగుపర్చాలని కోరారు. పంచాయతీల్లో పారిశుద్ధ్య లోపం ఎక్కువగా ఉందని, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని కొందరు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు వచ్చారు.