Nara Lokesh : ముగ్గురూ కలిస్తేనే విజయం సాధ్యం : లోకేశ్
ప్రజలు, ప్రభుత్వం, పెట్టుబడి దారులు కలిస్తేనే భాగస్వామ్య సదస్సు విజయవంతమవుతుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు
ప్రజలు, ప్రభుత్వం, పెట్టుబడి దారులు కలిస్తేనే భాగస్వామ్య సదస్సు విజయవంతమవుతుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖలో ఈ నెల 14, 15వ తేదీల్లో పెట్టుబడుల కోసం భాగస్వామ్య సదస్సు జరగనుందని, ఈ సదస్సు ద్వారా ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మొత్తం 48 సెషన్స్ జరుగుతాయని, 9.8 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు వస్తాయని తాము భావిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు...
తద్వారా 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఏపీలో సమర్థ నాయకత్వం ఉందని, మంచి ట్రాక్ రికార్డు ఉన్న ముఖ్యమంత్రి ఈ సదస్సును నిర్వహిస్తుండటం అదనపు బలం అని లోకేశ్ తెలిపారు. నిన్న ముంబయిలో చాలా మంది పారిశ్రామికవేత్తలను కలిశానని, వారు కూడా విశాఖ సదస్సుకు వచ్చేందుకు అంగీకరించారని నారా లోకేశ్ తెలిపారు. పదహారు నెలల్లో పది లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు ఆంధ్రరాష్ట్రానికి వచ్చాయని నారా లోకేశ్ తెలిపారు.