Andhra Pradesh : మండలి ఛైర్మన్ ను కలిసిన జయమంగళ వెంకటరమణ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజును ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కలిశారు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజును ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కలిశారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీగా జగన్ ఎంపిక చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జయమంగళ వెంకటరమణ తిరిగి కూటమిపార్టీలోకి చేరడానికి ప్రయత్నిస్తున్నారు.
రాజీనామా ఆమోదించాలని...
జనసేనలో చేరాలన్న ఆయన ప్రయత్నంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఏడాది దాటి పోయినా శాసనమండలి ఛైర్మన్ ఆమోదించకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నాలుగు వారాల్లోగా రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జయమంగళ వెంకటరమణ నేడు శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజును కలసి తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు.