Vijaywada : ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకాలు మొదలయ్యాయి
ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ద్వాదశ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు నేడు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ అత్యంత పవిత్రమైన ఆగమ శాస్త్రోక్త కార్యక్రమం, వేదమంత్రోచ్ఛారణలు మరియు భక్తిశ్రద్ధల మధ్య ఉదయం మొదలైంది.ఈరోజు మొదటి రోజు కనక దుర్గా నగర్ ప్రవేశద్వారం నుంచి వేద పండితులు, అర్చకులు పవిత్ర కలశాలను తీసుకుని, ఇంద్రకీలాద్రికి చేరుకునే ‘కలశ ఊరేగింపుఅత్యంత వైభవంగా జరిగింది.
మూడు రోజుల పాటు...
అనంతరం యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం మరియు దీక్షాధారణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నాలుగు గంటలకు అంకురార్పణ కార్యక్రమంతో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను తలపించేలా ఆచారాలు జరిగాయి. మొదటి రోజు కార్యక్రమాలు మంత్రపుష్పం, మూల మంత్ర హవనంతో ముగిశాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. పన్నెండేళ్లకొకసారి ఇలాంటి కార్యక్రమాలను నరి్వహిస్తామని ఆలయ పూజారులు తెలిపారు