Chandrababu : నేడు పార్టీ కార్యాలయానికి చంద్రబాబు

నేడు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు

Update: 2025-10-31 03:09 GMT

నేడు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ కార్యాలయానికి చంద్రబాబు చేరుకుంటారు. పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశంకానున్నారు. తిరువూరు వ్యవహారంతో పాటు పలు నియోజకవర్గాల్లో నేతల ఆధిపత్య పోరుపై చర్చించనున్నారు.

కూటమి పార్టీల మధ్య...
దీంతో పాటు కూటమి పార్టీల సమన్వయం, టీడీపీ కమిటీలపైనా చర్చ జరగుతుంది. ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేయడమే కాకుండా నేతల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని టీడీపీ నేతలకు చెప్పనున్నారు. పార్టీలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకోకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించనున్నారు.


Tags:    

Similar News