Andhra Pradesh : అచ్చెన్నాయుడుకు షాకిచ్చిన హైకమాండ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడుకు పార్టీ నాయకత్వం షాక్ ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడుకు పార్టీ నాయకత్వం షాక్ ఇచ్చింది. ఆఫ్కాఫ్ ఛైర్మన్ రాంప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ మత్స్యకారుల ఫెడరేషన్ ఛైర్మన్ ఎన్నికలను మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలు సీరియస్ గా తీసుకున్నారు. అచ్చెన్నాయుడు కర్నూలు జిల్లాకు చెందిన నవీన్ పేరును ప్రతిపాదించారు. కొల్లు రవీంద్ర రాంప్రసాద్ కు మద్దతిచ్చారు. అయితే ఇరు వర్గాలు క్యాంప్ లను నిర్వహించడంతో పార్టీ నాయకత్వం దృష్టికి వచ్చింది.
ఆఫ్కాఫ్ ఛైర్మన్ గా...
దీంతో తాము సూచించిన వారు మాత్రమే నామినేషన్ వేయాలని పార్టీ హైకమాండ్ సూచించింది. చివరకు ఆఫ్కాఫ్ ఛైర్మన్ గా రాంప్రసాద్ పేరును అధినాయకత్వం సూచించింది. దీంతో ఆయన ఒక్కరే నామినేషన్ వేశారు. రాంప్రసాద్ కడప జిల్లాకు చెందిన వారు. దీంతో అచ్చెన్నాయుడు మద్దతిచ్చిన నవీన్ నామినేషన్ వేయలేదు. పార్టీ హైకమాండ్ కొల్లు రవీంద్ర వైపు మొగ్గు చూపినట్లయింది.