ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లులే?

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి

Update: 2022-03-07 03:07 GMT

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ విశ్శభూషణ్ హరిచందన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ గా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి. కరోనా కారణంగా ఆయన గత రెండు సంవత్సరాల నుంచి వర్చువల్ గానే ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

26 వతేదీ వరకూ...
ఈ సమావేశాలు ఈ నెల 26వ తేదీ వరకూ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ప్రభుత్వం అప్పటి వరకూ సమావేశాలను నిర్వహించాలని యోచిస్తుంది. మొత్తం 20 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగే అవకాశముంది.
టీడీపీ పట్టుబట్టే....
ఈ సమావేశాలకు చంద్రబాబు దూరంగా ఉంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు హాజరు కావాలని నిర్ణయించారు. రాజధాని అమరావతి, హైకోర్టు తీర్పు, ఉద్యోగుల పీఆర్సీ, నిరుద్యోగం, అక్రమ మైనింగ్ వంటి 19 అంశాలపై చర్చకు పట్టుబట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. మొత్తం మీద ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి.


Tags:    

Similar News