Ap Budget : అంకెలు గత ఏడాదిని మించి ఉంటాయా? ఈసారి బడ్జెట్ భారీగా ఉండనుందా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది

Update: 2026-02-14 02:59 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. అదే రోజున వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ని సభలో ప్రవేశపెడతారు. 2024 జూన్ లో ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2025లో పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. గతసారి ఏకంగా 3. 22 లక్షల కోట్లకు పైగా భారీ బడ్జెట్ ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తొలిసారిగా ఏపీ బడ్జెట్ మూడు లక్షల కోట్లకు పైగా మార్క్ ని తాకింది. ఈసారి అంతకు మించి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఆదాయం పెరగడంతో పాటు ఖర్చులు కూడా పెరిగాయి. అప్పులు కూడా పెరగడంతో ఈ సారి బడ్జెట్ రూపకల్పనలో ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవవనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

ఈసారి మాత్రం అధికంగా...
దానికి కారణం ఏపీ ఆదాయం పెరుగుతోందని వివిధ రంగాల నుంచి రావాల్సిన ఆదాయం వస్తుందని అంచనాలతో ఆ బడ్జెట్ ని రూపకల్పన చేశారు. ఇక ఈసారి బడ్జెట్ చూస్తే దానిని మించి ఉండొచ్చు అని అంటున్నారు.ఈసారి బడ్జెట్ అభివృద్ధికి సూచికగా ఉండొచ్చు అని అంటున్నారు. ఈసారి బడ్జెట్ ఏకంగా మూడున్నర లక్షల కోట్ల రూపాయల పై దాటి ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఏపీలో గత ఏడాది కాలంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. అంతే కాదు అభివృద్ధికి సంబంధించి కూడా యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసి మరీ అమలులోకి పెడుతున్నారు. దాంతో బడ్జెట్ అంకెలు కూడా బాగా పెరుగుతుందని అంటున్నారు. అలాగే అన్ని వర్గాలకు మేలు జరిగేలా ఈసారి బడ్జెట్ కూర్పు ఉండొచ్చు అని అంటున్నారు. ఈసారి 3.48 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారని తెలిసింది.
అమరావతితో పాటు సంక్షేమానికి...
రాజధాని అమరావతికి భారీ కేటాయింపులు ఉండే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి పారుదల రంగానికి సైతం బడ్జెట్ లో అగ్ర తాంబూలం ఉండొచ్చు అని చెబుతున్నారు. అలాగే సంక్షేమం అభివృద్ధి రెండింటికీ సమంగా ఈ బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుందని చెబుతున్నారు. వివిధ సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించిన కేటాయింపులు బడ్జెట్ లో చోటు కల్పించే అవకాశముంది. ఇక సంక్షేమ పథకాలకు కూడా బడ్జెట్ లో అధిక భాగం కేటాయింపులు చేయనున్నారు. సూపర్ సిక్స్ హామీల అమలుకు ఈ కేటాయింపులతో విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని అధికార పక్షం యోచిస్తుంది. గత ఏడాది అంటే 2025-26 ఆర్ధిక సంవత్సరంలో వ్యవసాయ బడ్జెట్ ను 48 వేల కోట్లతో ప్రవేశపెట్టారు. ఈసారి అరవై వేల కోట్ల దాకా ఈసారి వ్యవసాయ బడ్జెట్ ని రూపకల్పన చేస్తున్నారు .


Tags:    

Similar News