Andhra Pradesh Budget : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం "సూపర్" స్టెప్

ఆంధ్రప్రదేశ్ లో గత తొమ్మిది నెలలుగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం కార్యక్రమం ఈ ఏడాది ప్రభుత్వం అమలు చేయనుంది

Update: 2025-02-28 05:55 GMT

ఆంధ్రప్రదేశ్ లో గత తొమ్మిది నెలలుగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం కార్యక్రమం ఈ ఏడాది ప్రభుత్వం అమలు చేయనుంది. బడ్జెట్ లో నిధులు కేటాయింపులు చేసింది. 9,407 కోట్ల రూపాయలను కేటయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. తల్లికి వందనం అమలు చేస్తామని ఇదివరకే ప్రకటించినా బడ్జెట్ లో నిధులు కేటాయింపు ఎలా ఉంటుదన్న దానిపై ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు.

మే నెల నుంచి...
వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం కాగానే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తల్లికి వందనం పథకాన్ని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మవొడి పథకం కింద తల్లి ఖాతాలోనే నిధులను జమ చేసేవారు. అయితే చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులున్నా వారికి ఈ పథకం వస్తుందని కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. గత ప్రభుత్వం మాత్రం అమ్మఒడి ఇంటికి ఒక్కరికే ఈ పథకాన్ని అందించింది.
అర్హతలివే...
దీంతో పాఠశాలలు జూన్ నెల నుంచి ప్రారంభం కానున్నాయి. మే నెల నుంచి తల్లికి వందనం కింద నిధులు జమ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి వాళ్లు రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఉండాల్సి ఉంటుంది. చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడంతో ఇప్పటికే దీనిపై అధికారులు కసరత్తులు ప్రారంభించారు. హాజరు శాతం కూడా 75 శాతం పైన ఉంటేనే గత ప్రభుత్వం అమ్మఒడి పథకం నిధులు విడుదల చేసేది. దానిని ఈ ప్రభుత్వం అలాగే కొనసాగించే వీలుంది. దీంతో పాటు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికే ఈ పథకం వర్తింప చేయనున్నారు. తెలుపు రంగు రేషన్ కార్డు తప్పనిసరి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా ఈ పథకం వర్తించదని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే త్వరలోనే దీనికి సంబంధించి విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది.


Tags:    

Similar News