Ap Budget : స్థానిక సంస్థల పై ఫోకస్.. బడ్జెట్ అంకెలు అవే చెబుతున్నాయిగా?
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అంచానాలు రూపొందించినట్లు కనపడుతుంది
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అంచానాలు రూపొందించినట్లు కనపడుతుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మూడు ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కాకుండా, ఏ ఎన్నికలోనైనా కూటమి ప్రభుత్వం విజయం సాధించేలా అంకెలు ఉన్నాయి. తొమ్మిది జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతంగా అభివృద్ధిగా తీర్చిదిద్దుతామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
కేటాయింపులివే...
ఇది కోస్తాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన అంశం. ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ఉపాధి అవకాశాలు పెరగడానికి కూడా బడ్జెట్ లో అధికంగా కేటాయింపులు జరిపినట్లు కనపడుతుంది. విశాఖ ఎకనామికల్ జోన్ కోసం 28,000 కోట్ల రూపాయలు కేటాయించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల వాసులను ఆకట్టుకునేలా ఈ నిధుల కేటాయింపు జరిగింది. ఇక రాయలసీమలోని నాలుగు జిల్లాలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. రాయలసీమ గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్ కు 30,000 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
రాజధాని అమరావతి నిర్మాణానికి - 6,000 కోట్లు
విద్యుత్తు శాఖ - 13,934 కోట్లు
రోడ్లు, పోర్టు, ఎయిర్ పోర్టులు - 13,546 కోట్లు
పరిశ్రమలు - 3,161 కోట్లు
సర్దుబాటు నిధి - 1,500 కోట్లు
విబీ జీ రామ్ జీ - 8365 కోట్లు
గృహ నిర్మాణ రంగం - 5,451
ఎన్టీఆర్ వైద్య సేవ - 4,000 కోట్లు
జల్ జీవన్ - 4,000 కోట్లు
స్వచ్ఛ భారత్ మిషన్ - 1,037 కోట్లు
విశాఖ ఎకనామికల్ జోన్ - 28,000 కోట్లు
రాయలసీమ గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్ - 30,000 కోట్లు
అన్నదాత సుఖీభవ - 6,600 కోట్లు
తల్లికి వందనం -
ఎన్టీఆర్ భరోసా - 27,719కోట్లు
స్త్రీ శక్తి - 1.420 కోట్లు