Nadendla : విశాఖలో నాదెండ్ల నిర్బంధం
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని విశాఖ నోవా టెల్ హోటల్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు
Nadendla manohar
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని విశాఖ నోవా టెల్ హోటల్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను హోటల్ నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. విశాఖలో టైకూన్ జంక్షన్ మూసివేతను నిరసిస్తూ జనసేన నిరసన కార్యక్రమం పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఈ చర్యకు దిగారు.
నోవాటెల్ నుంచి...
విశాఖలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనటానికి వీల్లేదని పోలీసులు చెప్పారు. అయినా నాదెండ్ల మనోహర్ నిరసనలో పాల్గొంటానని చెప్పడంతో ఆయనను బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. తమ నేతను నిర్భంధం నుంచి వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.