Ys Jagan : నేడు బెంగళూరుకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత జగన్ నేడు బెంగళూరుకు బయలుదేరి వెళుతున్నారు
వైసీపీ అధినేత జగన్ నేడు బెంగళూరుకు బయలుదేరి వెళుతున్నారు. ఇటీవల తాడేపల్లికి వచ్చిన జగన్ మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. నిన్న వైసీపీ విద్యార్థి విభాగం నేతలతో సమావేశమయ్యారు. కొందరు ముఖ్యమైన నేతలతో సమావేశమై పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. నేతలకు కొన్ని విషయాల్లో దిశానిర్దేశం చేశారు.
ఆందోళన కార్యక్రమాలను...
ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని, మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణపై ఉద్యమించాలని విద్యార్థి సంఘాల నేతలను ఆదేశించారు. ఈరోజు ఉదయం 11.05 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరిమధ్యాహ్నం 2.40 గంటలకు బెంగళూరులోని తన నివాసానికి చేరుకుంటారు.