Chandrababu : ఎల్పీజీ కొరతపై చంద్రబాబు సమీక్ష

గృహ వినియోగానికి ఎల్పీజీ సిలెండర్ల కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు

Update: 2026-03-17 06:53 GMT

గృహ వినియోగానికి ఎల్పీజీ సిలెండర్ల కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వంట గ్యాస్ కొరత లేకుండా చూడాలని అన్నారు. ప్రధానంగా ఆసుపత్రులు, పాఠశాాలలు, దేవాలయాలకు ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా అందచేయాలని కోరారు. ఎల్పీజీ నిల్వలపై సమీక్ష చేసిన చంద్రబాబు అన్ని గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు.ప్రస్తుతం రాష్ట్రంలో 17 వేలకు మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా...
అయితే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఓటీపీల ద్వారానే గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తే బ్లాక్ మార్కెట్ కు చెక్ పడుతుందని తెలిపారు. గ్యాస్ పంపిణీలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని కోరారు. ప్రస్తుతం గృహ వినియోగానికి ఉపయోగించే సిలిండర్ల పంపిణీ రెండున్నర రోజుల సమయం పడుతుందని, ఎక్కువ మంది బుక్ చేసుకుంటుండటంతో కొంత ఆలస్యమవుతుందని, ప్రయారిటీ పద్ధతిలో సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.


Tags:    

Similar News