Ys Sharmila : అమరావతి పేరుతో లూటీ : వైఎస్ షర్మిల

రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడత భూసమీకరణపై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు

Update: 2025-11-29 11:57 GMT

రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడత భూసమీకరణపై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. రాజధాని పేరుతో సేకరించిన తొలివిడత 54 వేల ఎకరాల్లో రాజధాని ఎక్కడ అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రెండో విడత 20 వేల ఎకరాలు అదానీ,అంబానీ కోసమేనా? అని ఆమె నిలదీశార. రెండో విడత భూ సేకరణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్న వైఎస్ షర్మిల 54 వేల ఎకరాలపై వెంటనే శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముంబయి ఛత్రపతి విమానాశ్రయం 1850 ఎకరాలు..అమరావతిలో విమానాశ్రయానికి ఐదువేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు.బీజింగ్,లండన్ లో ఒలంపిక్స్ నిర్వహించే స్పోర్ట్ హబ్ లు 150 ఎకరాలు మాత్రమేనన్న ఆమె అమరావతి స్పోర్ట్స్ హబ్ కి 2500 ఎకరాలు ఎందుకన్నారు. రియల్ రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతుందని వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు.

ఇంత దోపిడీనా?
అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతుందని, మొదటి దశలో 25 గ్రామాల నుంచి 34 వేల ఎకరాలు తీసుకున్నారని, 29 వేల మంది రైతులు భూములు ఇచ్చారని, ఇది కాకుండా ప్రభుత్వ భూములు కలుపుకునే 54 వేల ఎకరాలు ఉందన్న వైఎస్ షర్మిల పదకొండేళ్లు అమరావతికి రూపు లేదన్నారు. 217 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఒక్క కిలోమీటర్ అభివృద్ధి కూడా జరగలేదన్న షర్మిల 54 వేల ఎకరాల్లో అమరావతి నిర్మాణం జరిగినట్లు బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. మొత్తం అభివృద్ధి జరిగి విశ్వనగరం అయినట్లు చెప్తున్నారని, బెస్ట్ లెవెబుల్ సిటీ అయినట్లు కలరింగ్ ఇస్తున్నారని అన్నారు. అంతా అభివృద్ధి జరిగి ఇప్పుడు మళ్ళీ భూములు కావాలని స్కెచ్ వేశారని, తీసుకున్న 54 వేల ఎకరాల సంగతి ఏంటి ? అని ఆమె ప్రశ్నించారు. మొదటి విడతలో ఉన్న యాభై నాలుగు వేల ఎకరాల్లో ఎవరెవరికి ఇచ్చారన్న దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.




Tags:    

Similar News