Andhra Pradesh : నేడు వైసీపీ అధినేత కీలక భేటీ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కానున్నారు.

Update: 2025-11-18 03:04 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. నియోజకవర్గాల సమన్వయ కర్తలతో నేడు సమావేశమై వారితో పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు జగన్. మరొకవైపు కొన్ని నియోజకవర్గాల సమన్వయ కర్తలకే ఈ సమావేశానికి ఆహ్వానం అందింది.

నియోజకవర్గాల సమన్వయ కర్తలతో...
ఆ యా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితితో పాటు పార్టీ రకూపొందించిన కార్యక్రమాలను జరుగుతున్న తీరును అడిగి తెలుసుకోనున్నారు. వివిధ ప్రజా సమ్యలపై ఆందోళనలు చేయాల్సిన అవసరంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపు నివ్వనున్నారు. ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేసుకుని జనంలోకి వెళ్లాలని సూచించనున్నారు.


Tags:    

Similar News