Andhra Pradesh : నేడు ఏపీకి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నేడు ఆంద్రప్రదేశ్ లో పర్యటించనున్నారు.
భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నేడు ఆంద్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దురగ్మమ్మను దర్శించుకుంటారు. ఉప రాష్ట్రపతి పర్యటన సందర్భంగా గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి దుర్గగుడి వరకూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ వీవీఐపీ దర్శనాలను కూడా ఆలయ అధికారులు రద్దు చేశారు.
తిరుమలకు చేరుకుని...
అనంతరం ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ దంపతులు తిరుపతి బయలుదేరి వెళతారు.రాత్రి 8.30 గంటలకు తిరుమలకు చేరుకుంటారు.ఉపరాష్ట్రపతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మహాద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకోనున్నారు. పెద శేషవాహన సేవలో పాల్గొంటారు. రేపు ఉదయం ఆలయ మర్యాదలతో శ్రీవారిని దర్శించుకుంటారు.