మహా చండీ దేవిగా దుర్గమ్మ
విజయవాడలోని ఇంద్రకీలాద్రి పైన దుర్గమ్మ నేడు శ్రీ మహా చండీ దేవిగా దుర్గమ్మగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి పైన దుర్గమ్మ నేడు శ్రీ మహా చండీ దేవిగా దుర్గమ్మగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అలంకారాన్ని దర్శించుకుంటే ఎన్నో శుభాలు కలుగుతాయని పురాణేతిహాసాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి మహోత్సవాల్లో పరమార్థం. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై ఆశ్వయుజ శుద్ధ దశమి వరకూ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.
బారులు తీరిన భక్తులు...
ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబరు2 వరకూ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమిస్తుంది. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు మహాచండిగా భక్తులను అనుగ్రహిస్తోంది దుర్గమ్మ. మహాచండీ అవతారంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు దుర్గగుడికి తరలి వచ్చారు. పోలీసులు భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ లో స్వామి వారిని దర్శంచుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు.