TDP : రేపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

రేపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది

Update: 2026-01-24 07:24 GMT

రేపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం జరగనున్న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నార. - పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

ఏపీలో అవసరమైన...
ప్రధానంగా ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన పనులను చేయడానికి పార్లమెంటు సభ్యులు కేంద్రప్రభుత్వ పెద్దలతో కలసి చర్చించాలని చంద్రబాబు నాయుడు ఎంపీలను ఆదేశించనున్నారు. అలాగే నిధుల కేటాయింపుపై కూడా నిర్మలా సీతారామన్ తో చర్చించాలని చెప్పనున్నారు.


Tags:    

Similar News