Andhra Pradesh :ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... అమరావతి, తిరుపతి వాసులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది

Update: 2026-03-10 05:34 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

రెండు ఎకనామిక్ జోన్లు...
రెండు ఎకనామిక్ జోన్లకు ఇద్దరు ఉన్నతాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి ఎకనామిక్ రీజియన్ సీఈవోగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ను నియమించింది. తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈవోగా ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ను ప్రభుత్వం నియమించింది.


Tags:    

Similar News