Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. ఉదయం 10.20 గంటలకు సచివాలయానికి చంద్రబాబు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మైనింగ్ శాఖపై సమీక్ష ను చంద్రబాబు నిర్వహించనున్నారు. అధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు.
సీఆర్డీఏ అధారిటీ సమావేశంలో...
మైనింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంతో పాటు ఉచిత ఇసుక పాలసీ అమలుపై కూడా చంద్రబాబు అధికారులతో ఈ సందర్భంగా సమీక్ష చేయనున్నారని తెలిసింది. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్టీజీఎస్ పై సమీక్షను నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబు ఉండవల్లిలోని
తన నివాసానికి చేరుకుంటారు